Thursday, January 23, 2025

నాటో సమ్మిట్‌ను నిరసిస్తూ ఐప్సో నిరసన

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః ప్రపంచంలోని తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఆసియా.. పసిఫిక్ ప్రాంతంలో విస్తరించేందుకు నాటో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) ట్యాంక్‌బండ్ యుద్ద ట్యాంక్ వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఐప్సో జాతీయ అధ్యక్షులు డాక్టర్ డి. సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య అస్థిరతను, ఉద్రిక్తత వాతావరణాన్ని, మారణహోమాన్ని సృష్ఠిస్తున్న నాటో విధానాలను తిప్పికొట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. లుద్వేనియాలోని విల్నీయస్‌లో జరుగుతున్న నాటో సమ్మిట్‌ను ప్రతి ఒక్కరూ నిరసించాలని అన్నారు. నాటో కారణంగా ప్రపంచ శాంతికి భంగం కలుగుతోందని అన్నారు.

ఐప్సో అధ్యక్ష వర్గ సభ్యులు డాక్టర్ తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ 1949లో అమెరికా కనుసన్నల్లో ఏర్పాటైన నాటో సంస్థలో ముందుగా 11 దేశాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం 31 దేశాలకు విస్తరించి యుద్ద కోరలతో కాటేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె. యాదవరెడ్డి, ఐప్సో తెలంగాణ రాష్ట్ర సమన్వయ కమిటీ ప్రధానకార్యదర్శి కేవియల్, రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, రఘుపాల్, ఐప్సో రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాచం సత్యనారాయణ, కె. నాగేశ్వర రావు, మెట్ల జగన్, వెంకటస్వామి గౌడ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News