ఈ ఏడాదిలో ఫోన్ల తయారీ కంపెనీలు అనేక మోడల్స్ ఫోన్స్ ను మార్కెట్లో తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఐకూ 13 సిరీస్ మొబైల్ మార్కెట్లో విడుదల అయినా విషయం తెలిసిందే. అయితే, ఈరోజు మరో ఫోన్ వన్ ప్లస్ 13 సిరీస్ కూడా విదుదల అయింది. ఈ క్రమంలో ఏ మొబైల్ ఫోన్ కొంటె బెస్ట్ అనేది పనితీరు, డిస్‌ప్లే, కెమెరా ఆధారంగా చూద్దాం.
డిజైన్
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ అనేక మార్పులతో ఐక 12 వలె కనిపిస్తుంది. వెనుక కెమెరా మాడ్యూల్ ఎనర్జీ హాలో ఎల్ఈడి తో వస్తుంది. మరోవైపు.. వన్ ప్లస్ 13 రిఫ్రెష్ లుక్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది వెనుక ప్యానెల్‌లో సర్కిల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. అయితే ఇందులో నాలుగు సెన్సార్లు ఉన్నాయి.
డిస్ప్లే
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.82 అంగుళాల QHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని ప్రకాశం 4500 నిట్‌లు. మరోవైపు.. ఐకూ 13 ఫోన్‌లో 6.82 అంగుళాల 2K BOE Q10 8T LTPO OLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. అంతేకాకుండా 4500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది.
ప్రాసెసర్
ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ Qualcomm కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అమర్చబడి ఉన్నాయి. వీటిలో ఆండ్రాయిడ్ 15 OS అందించారు. ఇక ఐకూ ఫోన్‌లు 5 సంవత్సరాల భద్రతా నవీకరణలను పొందుతాయి.
బ్యాటరీ
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు.. వన్ ప్లస్ ఫోన్‌లో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, దీనికి 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
కెమెరా సెటప్
ఐకూ 13 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, OISతో 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. మరోవైపు.. వన్ ప్లస్ 13 వన్ ప్లస్ 12 50MP LYT-808 ప్రధాన కెమెరానుకలిగి ఉంది. అయితే, టెలిఫోటో, అల్ట్రావైడ్ లెన్స్‌లు 50MPకి అప్‌గ్రేడ్ చేసారు.
ధర
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ 12జీబీ /256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక 16జీబీ /512జీబీ వేరియంట్ కోసం రూ.76,999 చెల్లించాలి. 24జీబీ /1TB స్టోరేజ్ మోడల్ రూ. 89,999కి లాంచ్ చేసింది. మరోవైపు.. ఐకూ 13 రెండు వేరియంట్‌లలో వస్తుంది. అవి 12జీబీ +256జీబీ వేరియంట్ ధర రూ. 54,999గా పేర్కొంది. ఇక 16జీబీ +512జీబీ వేరియంట్ రూ. 59,999కి వస్తుంది.