అమెజాన్‌లో ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్, డిస్కౌంట్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐకూ Z9s ప్రో 5జీ ఫోన్ పై కూడా అదిరే డీల్ ఉంది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్స్ లో ఏది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఐకూ Z9s ప్రో ఫోన్ ఆఫర్, స్పెసిఫికేషన్స్ గురుంచి తెలుసుకుందాం.
ఆఫర్
ఐకూ Z9s ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ. 29,999 కిఉంది. అయితే, 17 శాతం తగ్గింపు తర్వాత రూ.24,999కి లభిస్తోంది. అలాగే వినియోగదారులు వివిధ బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా రూ. 3,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ను కేవలం రూ.21,999కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. కస్టమర్‌లకు ఫోన్‌పై రూ.22,800 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు కూడా పొందొచ్చు.
స్పెసిఫికేషన్‌లు
ఐకూ Z9s ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 120Hz కర్వ్డ్ అల్మొడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్ టచ్ OS 14పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 6.77-అంగుళాల పూర్తి-HD+ అల్మొడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది.
ఇక ఫోటోగ్రఫి కోసం..ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ IMX882 సెన్సార్, f/1.7 ఎపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది f/2.2 ఎపర్చర్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం..ఐకూ Z9s ప్రో 5జీ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.ఈ ఫోన్ 80W ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.