Wednesday, January 22, 2025

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్

- Advertisement -
- Advertisement -

ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతన సవరణలోని ఐఆర్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగులకు 5శాతం ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించగా అక్టోబర్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ రావడం, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా సిఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కలిశారు. పిఆర్సీ, ఐఆర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిఎం వెంటనే స్పందించి ఆర్థిక శాఖకు నోట్ పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తాజాగా ఆర్థిక శాఖకు ప్రభుత్వ రంగ సంస్థల స్పెషల్ సెక్రటరీ లేఖ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News