Wednesday, January 22, 2025

దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశాల చివరి రోజు సభలో రాష్ట్ర ఆవిర్భావం- సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ము ఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి వివరించారు. సాగు నీరు, తాగునీరు, వ్యవసాయం సహా వివిధ అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు. నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తామని, గ్రూప్-2, ఇతర పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించామని వెల్లడించారు.
ఉద్యోగులకు పేస్కేలు ఇస్తాం
‘మజ్లిస్ పార్టీ మాకు ఎప్పుడైనా మిత్ర పక్షమే. భవిష్యత్లోనూ మజ్లిస్‌ను కలుపుకొని పోతాం. బ్రాహ్మణులకైనా, మైనార్టీలకైనా బహిరంగంగానే మంచి చేస్తాం.అలవికాని హామీలను మేం ఎప్పుడూ ఇవ్వ ము, బిఆర్‌ఎస్ ఎప్పుడూ లౌకికవాద పార్టీయే. అ న్నీ ఉచితంగా ఇస్తున్నామని తెలంగాణను బిజెపి వి మర్శించింది. అదే కర్ణాటక ఎన్నికల్లో బిజెపి ఎన్నో ఉచితాల హామీలు ప్రకటించింది. మా అమ్ముల పొ దిలో కూడా చాలా అస్త్రాలు ఉన్నాయి. అస్త్రాలు తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయి. స మయం వచ్చినప్పుడు మేం కూడా ఫించన్లు పెం చుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 4వేల పింఛను ఇవ్వట్లేదు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ ఉద్యోగుల జీతాలు పెంచుతాం. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పేస్కేలు ఇస్తాం. అ తి త్వరలోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం. ఉద్యోగుల పాత పింఛన్ విధానాన్ని పరిశీలిస్తాం. ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే. ప్రపంచమంతా ప్రభా వం చూపేలా హైదరాబాద్ స్థిరాస్తి రంగం పెరుగుతోంది. హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి. తెలంగాణ ఐటి ఎగుమతు లు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయి. రాబోయే రోజుల్లో ఎన్ని పథకాల నిధులు పెంచాలో అన్నీ పెంచుతాం‘ అని సిఎం ప్రకటించారు.
రాష్ట్రానికి రూపాయి ఇవ్వని కేంద్రం.. అవార్డులు మాత్రం ఇచ్చింది…
‘ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుం డా ప్రతి ఇంటికి 20వేల లీటర్ల మంచినీరును గ్రావిటీతోనే వేలాది గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు ఇ స్తున్నాం. పల్లెలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నాం. 13 రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మన మిషన్ భగీరథను అధ్యయనం చేస్తున్నాయి. పారిశుద్ధ్యం, మంచినీరు విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులిచ్చింది.రాష్ట్రానికిరూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగానే ఇచ్చిం ది. తండాలు, గిరిజన ఆవాసాల్లో రో గా లు కనిపిస్తున్నాయా ఇప్పుడు? దేశంలోనే వీధి న ల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో35వేలచెరువులుఅదృశ్యమయ్యాయి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందే మిషన్ భగీరథ పేరు
తెలంగాణ వస్తే పునర్నిర్మాణం ఎక్కడ మొదలు పె ట్టాలని చాలా పర్యాయాలు చర్చలు జరిపాం. ఆ చార్య జయశంకర్, విద్యాసాగర్‌రావుతో చర్చిం చాం. తెలంగాణ వస్తే ముందుగా చెరువులు బాగు చేసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్ర ఏర్పాటుకు ఆ రు నెలల ముందే మిషన్ భగీరథ అని పేరు పెట్టాలని భావించాం. మిషన్ కాకతీయ పుణ్యమే 30 ల క్షల బోర్లు నీళ్లు పోస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వ రం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకలకు నీళ్లు వెళ్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి తీసుకొనేలా ప్రణాళికలు చేశాం. దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ.మన పునరావాస గ్రామాలు చూసి కేం ద్ర బృందాలు ప్రశంసించాయి.కాలువల్లో ఏడాది పొడుగునా నీళ్లు పారుతున్నాయి. కరీంనగర్‌లో 4 సజీవ జలధారలు కాళేశ్వరం వల్లే పారుతున్నాయి.
సింగరేణి సంస్థను ముంచిందే మీరు..
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి రావ డం కోసం అలవిగాని హామీలిస్తూ ప్రజలను మో సం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. ‘సింగరేణిలో ఔట్ సోర్సింగ్ పెట్టిన్రు.. మీరే పెట్టిన్రు. మేం దానిని ఇంకా బెటర్ చేసినం.. రాష్ట్రంలో మేం అధికారంలో వచ్చిన తొలిసారి 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినం. మళ్లీ లక్ష ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ కొనసాగుతున్నది. షార్ట్ టైంలో ఆల్ టైం రికార్డు ఇది’ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. సింగరేణిని నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీయే.. వంద శాతం తెలంగాణ కం పెనీ.. సమైక్య రాస్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు నడపలేక కేంద్రంలో అప్పులు తెచ్చినరు.. ఆ అప్పులు తీర్చలేక కేంద్రానికి 49 శాతం వాటా కట్టబెట్టిన ఘనులు మీరే.. సింగరేణిని ముం చింది కాంగ్రెస్ పార్టీయే.. మీ పరిపాలన నిర్వాకమే.. వంద శాతం తెలంగాణ కంపెనీలో 49 శా తం వాటా పుట్టిచ్చిందెవరు.. కాంగ్రెస్ పార్టీ పాలన ఫలితమే’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణి టర్నోవర్ కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే. తాజాగా సింగరేణి టర్నోవర్ రూ.33 వేల కోట్లు.. లాభాలు రూ.419 కోట్ల నుంచి రూ.2,222 కోట్లకు పెంచినం.. కాం గ్రెస్ పార్టీ హయాంలో సింగరేణి కార్మికులకు దస రా, దీపావళి బోనస్ రూ.83 కోట్లు ఇస్తే.. ఇప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది రూ.1000 కోట్ల బోనస్ ఇవ్వబోతున్నది. టిడిపి పాలనలో డిపెండెం ట్ ఉద్యోగాలు ఊడగొట్టిన్రు. కాంగ్రెస్ పార్టీ హ యాంలో డిపెండెంట్లను పునరుద్దరించలే.. కొనసాగించినరు. కాంగ్రెస్ పాలనతో గని కార్మికుడు మరణిస్తే రూ.లక్ష ఇచ్చేవారు. మా ప్రభుత్వం రూ.10 లక్షలఎక్స్ గ్రేషియాతోపాటు డిపెండెంట్ ఉద్యోగం తీసుకోని వారి కుటుంబాలకు రూ.25 లక్షల ప్యా కేజీ ఇస్తున్నాం. సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకుంటే రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం ఇస్తు న్నాం. సింగరేణి జాగల్లో పేదలు గుడిసెలేసుకుంటే 76 నంబర్ జీవో ద్వారా వారికి పట్టాలిచ్చి ఆదుకున్నం. సింగరేణి మీద మీ నుంచి మేం నేర్చుకోవాల్సిందేం లేదు’ అని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్
‘ఇవాళ విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగా ణ నెంబర్ వన్. జాతీయ సగటు మనకు సమీపం లో లేదు. అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చిందని ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తుచేశా రు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్.. మొన్న వీళ్ల క డుపులున్నది బయటపెట్టారు. ఇస్తమని చెప్పేది తొ మ్మిది గంటలు. పొద్దంతా ఇచ్చేది మూడు గంట లు.. రాత్రి ఇచ్చేది నాలుగు గంటలు. అక్కడికి వెళ్లి కరెంటు షాక్, పాములుకుట్టి వందలమంది చనిపోయారు. 24గంటల కరెంటు ఇస్తున్నా అడ్డగోలు గా మాట్లాడుతున్నారు. వాళ్లకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నయని భావిస్తున్నరు.వాలికి చూస్తే ఇ ల్లు సంగతి తెలుస్తుంది అన్నట్లుగా..కొన్ని సూచిక లు చూస్తే రాష్ట్రం మొత్తం పరిస్థితి తెలిసిపోతుంది’
ఏ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదు
‘ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో 24గంట ల విద్యుత్ సరఫరాలో లేదు. రాష్ట్రం ఏర్పడిన నాడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్శ్చక్తి 7,778 మెగావాట్లు. ఈ రోజు 18,756 మె గావాట్లు. అతి త్వరలో, నాలుగైదు నెలల్లో పబ్లిక్ సెక్టార్లో స్థాపించిన అల్ట్రామెగా పవర్ ప్లాంట్ ఇండియాలోనే నెంబర్ వన్. ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంగా, జెన్కో ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల పవర్ స్టేషన్‌ను రూ.30వేలకోట్లతో నల్గొండ దామరచర్లలో ప్రారంభించాం. కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్లన్నీ ఉత్తర భాగంలో ఉన్నాయి. కొత్తగూడెం, పరకలా కాకతీయ కావచ్చు. భద్రాద్రి, ఎన్టీపీసీ రామగుం డం కావచ్చు. నిజాం స్థాపించిన పవర్ స్టేషన్లన్నీ గోదావరి ఒడ్డున ఉత్తరం వైపు ఉన్నాయి. ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలోనూ పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి. 2444 మెగావాట్ల జలవిద్యుత్ శ్రీశైలం, నాగార్జున సాగర్ మీదున్నది. ఇది సంవత్సరం పొడువునా రాదు. దక్షిణ తెలంగాణ సైతం బ్రహ్మాండంగా ఉండాలని సమృద్ధిగా నీరుంటాయని నల్లగొండ జిల్లాలో పెట్టాలని మం త్రి జగదీశ్ రెడ్డి నాతో కొట్లాడిండు. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరీ 100 టిఎంసిలు ఉంటది కాబట్టి ని పుణులతో చర్చించి దామరచర్లలో ప్లాంట్‌ను పెట్టాం’ అని తెలిపారు.
బిజెపికి చేతనైతే కరెంటు ఇవ్వరాదా?
‘నరేంద్ర మోడీకి మనమంటే ఏం పగనో. తల్లిని చంపి బిడ్డను బతికించారని అంటున్నరు. పునర్ వి భజన ద్వారా ఎన్టీపీసీలో 4వేల ప్లాంట్ పెట్టి మొ త్తం తెలంగాణకే సప్లయ్ చేయాలని చెప్పారు. పదేళ్ల కింద చట్టం చేస్తే ఇప్పటి వరకు హరీ లేదు శివ లేదు. 1600 మెగావాట్లే పని జరుగుతున్నది. ఇక్కడి నుంచి ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అమిత్ షా అనే ఆయన వచ్చి తిరుగుతాంటడు. నెల రోజుల్లో ప్రభుత్వాన్ని కూలగొడుతామంటరు. చేతనైతే కరెంటు ఇవ్వరాదా? ఇది చేతకాదు. 1600 మెగావాట్లు రెడీ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. దానిని ఇవ్వొచునన్నారు.
బండి పోతే బండి.. గుండు పోతే గుండు ఇస్తామన్న వ్యక్తి జాడ లేదు..
వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుం టాం. హైదరాబాద్‌లో తీవ్ర నష్టం జరిగితే కేంద్రం ఒక్క రూపాయి. ఇవ్వలేదు. వరదల్లో బండి పోతే బండి ఇస్తాం. గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడ లేదు. 7 లక్షల టన్నుల యూరియా వా డే తెలంగాణ ఇవాళ 27 లక్షల టన్నులు వాడుతోంది. మళ్లీ కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతు బంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 420 కేసులు వేశారు. ధా న్యం దిగుమతిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమిస్తోంది. తొలినాళ్లలోనే -40లక్షల టన్నుల సామ ర్థ్యం గల గోదాములు నిర్మించాం. తెలంగాణ గో దాముల్లో ప్రస్తుతం కోటి టన్నులు ధాన్యం ఉంది. వేలం ద్వారా విక్రయించాలని పౌరసరఫరాల శాఖ మంత్రిని ఆదేశించాం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే ఎఫ్‌ఆర్‌బిఎంలో కేంద్రం కోత విధించింది. దీంతో ఏటా రూ. 5 వేల కోట్లు నష్టపోతున్నాం. కేంద్రం వైఖరితో ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయాం. ధరణి పుణ్యమా అని 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. రైతు చనిపోయిన వారంలోనే ఆ కుటుంబానికి రూ. 5లక్ష లు వస్తున్నాయి‘ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఆర్‌టిసి ఉద్యోగులకు పిఆర్‌సి ఇస్తాం..
‘ఆర్‌టిసి బిల్లుపై గవర్నర్ తెలిసీ తెలియక అనవసరంగా వివాదం కొనితెచ్చుకున్నారు. ఆర్టీసీ పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది.నేను రవాణాశాఖ మం త్రిగా పనిచేశా. ఆ రోజుల్లో ఆర్టీసీ రూ.14కోట్ల న ష్టాల్లో ఉండేది. ఆ నష్టాన్ని పూడ్చి.. వివిధ ప్రక్రియ ల ద్వారా మరో రూ.14 కోట్ల ఆదాయం తె చ్చాం. డీజిల్ ధర పెరగటం ఆర్టీసీకి పెను భారంగా మా రింది. ఆర్టీసీలో రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. ఆర్టీసీ పరిస్థితిపై కేబినెట్లో 5 గంటలు చర్చించాం. చివరికి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకోవాలని అనుకున్నాం. ఏ పని చేసినా ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉటుంది. యువ ఐఎఎస్ అధికారులను నియమించి ఆర్టీసీని గాడి లో పెడతాం. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొంతమం ది విమర్శిస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. ప్ర భుత్వపరంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తాం. బస్ స్టేషన్లను ఆధునికీకరిస్తాం. అవసరమైతే మరి కొం త భూమిసేకరిస్తాం.ఆర్టీసీఉద్యోగులకుపీఆర్సీ ఇస్తాం. ఉద్యోగ భద్రత వస్తుందని వారు సంతోష పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన, నా పక్షాన గవర్నర్‌కు ధన్యవాదాలు‘అని సిఎంకెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News