న్యూయార్క్: ఇరాన్ ముఖ్య అణుశాస్త్రవేత్త మోసిన్ ఫక్రిజాదేను పక్కా ప్లాన్‌తో గత ఏడాది చంపింది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ అని తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఆర్టికల్‌ను ప్రచురించింది. యూరేనియంను శుద్ధిచేసి ఆయుధం గ్రేడ్ యూరేనియంగా మార్చే కార్యక్రమానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పెట్టిన పేరే ‘గ్రీన్‌సాల్ట్ ప్రాజెక్ట్’, దీనిని ‘ప్రాజెక్ట్ 1-11’ అని కూడా పిలుస్తారు ఇందులో పక్రిజాదే కీలకవ్యక్తి. ఆయన 14 ఏళ్లుగా ఇరాన్ అణాయుధ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ రక్షణ ఉండేది. అయితే ఆయనకు భద్రత ఏర్పాట్లు అంతగా ఇష్టం ఉండేవికావు.
గత ఏడాది ఫక్రిజాదే కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యారు. అతడి హత్యకు వాడినది రోబో. దీనిని ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో అమలుచేసిందని ‘న్యూయార్క్ టైమ్స్’ ఆర్టికల్ కథనం. ఇజ్రాయెల్ రోబో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అతడిని హతమార్చిందని కథనం. కారులో ప్రయాణించిన ఆయన భార సైతం గాయపడని విధంగా అతడిని హతమార్చడం గమనార్హం. కాగా ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్ పరువును దృష్టిలో ఉంచుకుని విషయాలను ఇరాన్ కావాలనే బయటపెట్టలేదని తెలుస్తోంది.