Wednesday, January 22, 2025

48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌పై రానున్న 48 గంటల్లో ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని, ఇందుకు ఇజ్రాయెల్ కూడా సన్నద్ధమవుతోందని వాషింగ్‌టన్ నుంచి వెలువడే ది వాల్ స్రేట్ జర్నల్ శుక్రవారం వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి వల్ల ఎదురయ్యే రాజకీయ పరిణామాలను ఇరాన్ యోచిస్తున్నట్లు ఇరాన్ నాయకత్వానికి సన్నిహితుడైన ఒక వ్యక్తిని ఉటంకిస్తూ జర్నల్ తెలిపింది.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు కనపడని తరుణంలో తన చిరకాల శత్రువైన ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి సన్నిద్ధం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇ్రజ్రాయెల్‌పై దాడి ప్రతిపాదన ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా ఖమేనీ ముందు ఉందని, ఇందులోని రాజకీయ ప్రభావాలపై ఆయన యోచిస్తున్నారని ఆయన సలహాదారులలో ఒకరు తెలిపినట్లు పత్రిక పేర్కొంది. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇటీవల ఇరాన్ కాన్సలేట్‌పై జరిగిన దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ డాడిలో ఇరాన్ సైనిక జనరల్‌తోపాటు ఆరుగురు సైనికాధికారులు మరణించారు. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది.

అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడిలో తమ పాత్ర గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సలేట్‌పై ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తమపై యుద్ధం చేస్తున్న హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు ఇవ్వడం పట్ల ఇజ్రాయెల్ గ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి ఖాయమని భావిస్తున్న అమెరికా ఇజ్రాయెల్‌లోని అమెరికా పౌరులకు హెచ్చరిక జారీచేసింది. ఇజ్రాయెల్‌ను శిక్షించాల్సిందే..అది జరుగుతుంది అంటూ డమాస్కస్‌లో జిరిగిన దాడి తర్వాత ఇరాన్ సుప్రీం నాయకుడు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News