- Advertisement -
అణు కార్యక్రమంపై చర్చలలో పాల్గొని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమైతే ఇరాన్ పై కచ్చితంగా సైనిక చర్య జరిగి తీరుతుందని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇక ఎక్కువ సమయంలేదని ఆయన ఇరాన్ కు మరో సారి సూచించారు.ఇరాన్ పై సైనిక చర్యకు దిగే అవకాశాలను ప్రశ్నించగా, అవసరమైతే కచ్చితంగా సైన్యం రంగంలోకి దిగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే సైనిక చర్యకు సైన్యం సర్వ సన్నద్ధంగా ఉంది. ఇజ్రాయిల్ కూడా స్పష్టంగా దీనిలో పాల్గొంటుంది అని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -