ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రేమికులను సోషల్ మీడియా ఒకటిగా కలుపుతోంది. ఆ మధ్య పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్ మీనాల మధ్య ప్రేమ చిగురించడానికి సోషల్ మీడియానే కారణమనే సంగతి తెలిసిందే. తాజాగా ఇదే సోషల్ మీడియా ఇరాన్ అమ్మాయినీ, ఉత్తరప్రదేశ్ అబ్బాయిని ఒక చోటకు చేర్చింది!
ఇరాన్ కు చెందిన 20 ఏళ్ల ఫైజా అనే అమ్మాయి, మొరాదాబాద్ కు చెందిన దివాకర్ కుమార్ మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రేమ చివుళ్లు తొడిగింది. దివాకర్ ఒక టూరిస్ట్ వ్లాగర్. చూడతగిన ప్రదేశాల గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాడు. ఇరాన్ లోని హమెడాన్ సిటీకి చెందిన ఫైజా అక్కడే ఓ యూనివర్శిటీలో చదువుకుంటోంది. ఆమెకు దివాకర్ పోస్టులంటే ఎంతో ఇష్టం. దివాకర్ పెట్టే పోస్టులను ఆమె మరొక సైట్ లోరీపోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. మూడేళ్లుగా సాగుతున్న తమ ప్రేమాయణానికి వివాహంతో ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. అంతే, ఫైజా తన తండ్రిని తీసుకుని మొరాదాబాద్ వచ్చేసింది. ఇక ఇద్దరూ పెళ్లి చేసుకోవడమే తరువాయి.
తమ పెళ్లిగురించి దివాకర్ మాట్లాడుతూ “ఫైజాను కలిసేందుకు గత ఏడాది జూలైలో ఇరాన్ వెళ్లాను. ఆ సమయంలో నేను పర్షియన్ నేర్చుకుంటే, ఫైజా హిందీ నేర్చుకుంది. కాబట్టి మా మధ్య కమ్యూనికేషన్ కు ఇబ్బందేమీ లేదు. ఫైజా కుటుంబం వాల్ నట్ సేద్యం చేస్తుంది. మా రెండు కుటుంబాలకూ మా పెళ్లి పట్ల అభ్యంతరాలేమీ లేవు. ప్రస్తుతం మొరాదాబాద్ లో ఉన్న ఫైజాకు తాజ్ మహల్, అయోధ్యలోని రామ్ మందరం చూడాలని ఉంది. త్వరలోనే వాళ్లని అక్కడికి తీసుకువెళ్తాను” అని చెప్పాడు.
#Faiza of #Iranian got engaged to Diwakar of Moradabad, fell in love on the internet, reached India with father Masood…
ईरान कि फैजा ने मुरादाबाद के दिवाकर से कि सगाई, इंटरनेट पर हुआ प्यार, पिता मसूद संग पहुँची भारत… #InternetSaffronTrapped #IranianGirl pic.twitter.com/fpArIVaAGs
— 🦋عافیہ انجم🦋 (@AfiaAnjums) March 17, 2024