Sunday, December 22, 2024

ఇరకాటపు వీడియో.. ఇరాన్ మంత్రి భారత్ పర్యటన రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సెయిన్ అమీర్ అబ్దోల్లహియాన్ భారత్ పర్యటన వాయిదా పడింది. వచ్చే నెలలో ఆయన రైజినా చర్చలలో పాల్గొనేందుకు భారత్‌కు రావల్సి ఉంది. విదేశాంగ మంత్రిత్వశాఖతో కలిసి అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇరాన్‌లో ఇప్పుడు జరుగుతోన్న హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలలో భాగంగా ఓ మహిళ తన జుట్టు కత్తిరించుకుని నిరసన వ్యక్తం చేసిన ఘటన ఈ రైజినా సన్నాహాక కార్యక్రమంలో వీడియోగా వెలువడటంతో ఇరాన్ మంత్రి పర్యటన వాయిదా పడిందని వెల్లడైంది. రైసినా చర్చలకు నేపథ్యంగా వెలువరించిన వీడియోలో జుట్టు కత్తిరించుకుని ఉన్న మహిళ ఫోటో పక్కనే ఇరాన్ అధ్యక్షులు ఎబ్రహీం రైసీ చిత్రం కూడా పొందుపర్చి ఉంది.

దీని పట్ల ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి వీడియోను ఎందుకు వెలువరించారని ఇరాన్ ఎంబస్సీ వర్గాలు సంబంధిత అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్ (ఒఆర్‌ఎఫ్)ను, భారత విదేశాంగ మంత్రిత్వశాఖను అడిగినట్లు వెల్లడైంది. ప్రమోషనల్ వీడియోలోని ఈ భాగాన్ని తీసివేయాలని నెలరోజుల ముందే ఇరాన్ సూచించింది. అయితే తదనుగుణంగా నిర్వాహకులు స్పందించలేదు. దీనితో ఇప్పుడు ఇరాన్ మంత్రి తమ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు స్పష్టం అయింది. ప్రతి ఏటా ప్రపంచస్థాయి ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చకు రైజినా డైలాగ్ ఏర్పాటు అవుతోంది. 2016లో భారత విదేశాంగ మంత్రిత్వశాఖ సహకారంతో ఆఆర్‌ఎఫ్ దీనిని రూపొందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News