- Advertisement -
మస్కట్: ఇరాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 18కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే.. దాదాపు 750 మంది గాయపడ్డారని తెలిపారు. బందర్ అబ్బాస్ సమీపంలోని షాహిద్ రాజై ఓడరేవులో ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఓడరేవు ప్రాంతంలో నిల్వ ఉన్న కంటైనర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -