Friday, December 20, 2024

హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. అజార్ బైజాన్ సరిహద్దులోని బోలా సిటీ సమీపంలో వాతావారణం అనుకూలించకపోవడంతో అటవి ప్రాంతంలో కూలిపోయింది. దీంతో భద్రతా దళాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. ఇబ్రహీం ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన బలగాలు విమానా ప్రమాద స్థలాన్ని గుర్తించారు. అయితే, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇబ్రహీం మృతి ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్‌ కలాసీ, ఖొదావరిన్‌ అనే రెండు డ్యాంలను అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా విమానం కుప్పకూలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News