Sunday, December 22, 2024

అవి డ్రోన్లు కాదు… మాకు ఆటబొమ్మలే: ఇరాన్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారు జామున ఇరాన్ లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్ లో పేలుళ్లు సంబవించాయి. ఇది ఇజ్రాయెల్ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా, టెల్ అవీవ్, టెహ్రాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగమంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించినవి తమ ఆటబొమ్మల్లాంటివంటూ ఇజ్రాయెల్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికా లోని న్యూయార్క్ పర్యటనలో ఉన్న హొస్సేన్, అగ్రరాజ్య భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం జరిగింది దాడే కాదు. అవి డ్రోన్లు కాదు, మా పిల్లలు ఆడుకునే బొమ్మల్లాంటివి. మా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి సాహసం చేయలేదు కాబట్టి, ఇప్పుడు మేం ప్రతిచర్యకు దిగట్లేదు. కానీ ఒకవేళ, ఆ దేశం మాకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం, మా ప్రతిస్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుంది. దానికి వాళ్లు పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది ” అని నెతన్యాహు సర్కారును హెచ్చరించారు.

ఇరాన్ మద్దతు స్థావరాలపై శనివారం దాడులు
ఇదిలా ఉండగా ఇరాన్ మద్దతున్న స్థావరాలపై శనివారం తెల్లవారు జామున దాడులు జరిగాయి. మొత్తం ఐదు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం ముగ్గురికి గాయాలైనట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లకు కారణమేంటనేది ఇంకా స్పష్టత రాలేదు. తాజా ఘటనతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తలు భగ్గుమన్నాయి. ఈనెల 13న మూడు వందలకు పైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడినప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News