Friday, November 22, 2024

పాక్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్

- Advertisement -
- Advertisement -

Iran surgical strike in Pakistan

 

ఉగ్రవాదుల చెరలోని ఇద్దరు సైనికులను విడిపించుకెళ్లిన సైన్యం

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లో తాజాగా ఇరాన్ మెరుపు దాడులు నిర్వహించింది. కొన్నిరోజుల క్రితం భారత దేశం నిర్వహించిన మాదిరిగానే సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇరాన్ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్ దీనిని నిర్వహించింది. గత కొంత కాలంగా బెలూచిస్తాన్‌లో చెరలో ఉన్న తమ సైనికులిద్దరిని విడిపించుకు వెళ్లేందుకు ఇరాన్ ఈ మెరుపుదాడి నిర్వహించినట్టు ఐఆర్‌జెసి వెల్లడించింది. బెలూచిస్తాన్‌లోని జైష్ ఉల్ అదల్ అనే ఉగ్రవాద సంస్ధ 2018లో 12 మంది ఇరాన్ సైనికులను అపహరించింది. ఈ ముఠా ఇరాన్‌కు వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ సైనికులను విడిపించడానికి ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది. తాజాగా నిర్వహించిన మెరుపుదాడిలో ఇద్దరు బందీలను ఇరాన్ విడిపించుకు వెళ్లింది. బెలూచిస్తాన్‌కు చెందిన జైష్ ఉల్‌అదల్ ఉగ్రవాద సంస్థ ఇరాన్ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి పాకిస్తాన్‌కు తరలించుకుపోయిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News