Monday, December 23, 2024

పాక్‌లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్.. జైష్ అల్ అదిల్ కమాండర్ హతం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాక్ భూభాగంలో ఇరాన్ మరోసారి చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌లో ఉగ్రసంస్థ ‘జైష్ అల్ అదిల్ ’ కమాండర్ ఇస్మాయిల్ షాభక్ష్ హతమైనట్టు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అతడి అనుచరులు కొందరిని కూడా అంతమొందించినట్టు పేర్కొంది. గత నెల బలూచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్షంగా జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ఆ మరుసటి రోజే పాక్ ప్రతీకార దాడులు చేపట్టింది.

ఇరాన్ లోని సిస్థాన్‌ఒ బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని కొన్ని ప్రదేశాలను లక్షంగా చేసుకొని వైమానిక దాడులు చేసినట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్థాన్ కేంద్రంగా జైష్ అల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూపు పనిచేస్తూ ఇరాన్ లోని సిస్థాన్ బలూచిస్థాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హమాస్‌-ఇజ్రాయెల్ ఘర్షణలతో ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ఇప్పుడు ఇరాన్ పాక్ ఘర్షణలతో ఆందోళన వ్యక్తమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News