Tuesday, January 21, 2025

రణరంగంలోకి ఇరాన్

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌పై క్షిపణుల
వర్షం జెరూసలేం, టెల్
అవీవ్ లక్షంగా 400
మిసైళ్లతో దాడి సైరన్
మోగించి పౌరులకు
ఇజ్రాయెల్ హెచ్చరికలు

జెరూసలెం : పశ్చిమాసియా భగ్గుమంటోం ది. హెజ్‌బొల్లా స్థావరాలే లక్షంగా లెబనాన్‌పై ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సమయంలో ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చే పట్టింది. దీంతో ఇజ్రాయెల్ అధికారులు త మ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. సైర న్ల మోత మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చే స్తోంది.ఇరాన్ దాదాపు 400 క్షిపణులు ప్ర యోగించినట్టు తెలుస్తోంది. టెల్‌అవీవ్, జె రూసలెం లక్షంగా ఈదాడులకు దిగినట్లు తెలిసింది.అయితే ఇజ్రాయెల్‌కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థ ఇరాన్ క్షిపణి దాడుల ను ఎదుర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. దే శ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది. మరోవైపు ఈ పరిణామాల నడుమే ఇజ్రాయెల్ రాజధాని లో కాల్పులు కలకలం రేపాయి.

ఓ వ్య క్తి తుపాకీతో కాల్పులు జరపగా, పలువురు మృతి చెందినట్టు సమాచారం. ఇదిలావుండగా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉం టుందని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశా రు. అందుకోసం పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించుకునేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ భ ద్రతా విభాగంతో జరిగిన భేటీలో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలు హారిస్ కూడా ఉ న్నారు.అంతకు కొన్ని గంటల ముందుఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడులకు ఇ రాన్ సన్నాహాలు చేస్తోందని అమెరికా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే జరిగితే ఇ రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుం ద ని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News