Monday, January 20, 2025

ప్యారిస్ విమానాశ్రయంలోనే ఈరాన్ దేశస్థుడి మృతి !

- Advertisement -
- Advertisement -

ప్యారిస్: స్టీవెన్ స్పిల్‌బెర్గ్ ‘ద టెర్మినల్ ’ సినిమాకు ప్రేరణ అయిన ఈరాన్ దేశస్థుడు మెహ్రాన్ కరీమి నస్సేరీ శనివారం మధ్యాహ్నం విమానాశ్రయంలోని టెర్మినల్ 2ఎఫ్‌లో గుండెపోటుతో మరణించాడు. అతడు ప్యారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో 18 సంవత్సరాలు నివసించాడు. ఈ విషయాన్ని ప్యారిస్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. పోలీసులు, వైద్య బృందం ఆయనికి చికిత్స అందించినప్పటికీ రక్షించలేకపోయారు. కరీమి నస్సేరీ 1945లో జన్మించాడు. 1988 నుంచి 2006 వరకు అతడు విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో గడిపాడు. అతడి వద్ద రెసిడెన్సీ పేపర్లు లేని కారణంగా, చట్టపరమైన చిక్కుల కారణంగా విమానాశ్రయంలోనే నివసించాల్సి వచ్చింది. ఇటీవల కొన్ని వారాలుగా అతడు మళ్లీ విమానాశ్రయంలో నివసిస్తూ వచ్చాడు. అతడి ఉదంతం ఆధారంగానే టామ్ హ్యాంక్స్  ‘ద టెర్మినల్ ’ అనే ఫ్రెంచి సినిమా రూపొందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News