- Advertisement -
టెహ్రాన్ : ఇరాన్ ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేయడానికి ఆగంతకుడు గురువారం రాత్రి చేసిన ప్రయత్నం విచ్ఛిన్నమైందని ఇరాన్ పార్లమెంటరీ రివల్యూషనరీ గార్డు శుక్రవారం వెల్లడించారు. ఇరాన్ ఎయిర్ ఫాకెర్ 100 రీజినల్ కమర్షియల్ జెట్ నైరుతి నగరమైన అహ్వాజ్ నుంచి వాయువ్య నగరం మష్సాద్ కు వెళ్తుండగా ఆగంతకుడు విమానాన్ని పర్షియా గల్ఫ్ దక్షిణ తీరానికి మళ్లించడానికి ప్రయత్నించాడని గార్డు వెల్లడించారు. దాంతో ఇరాన్ విమానాన్ని అత్యవసరంగా సెంట్రల్ ఇరాన్ నగరం ఇస్పహాన్ వద్ద దింపవలసి వచ్చిందని చెప్పారు. ఆగంతకుడు బొమ్మతుపాకీ, నకిలీ పేలుడు పదార్థంతో బెదిరించినట్టు తెలిపారు. ఎట్టకేలకు ఆగంతకుడు మొహమ్మద్ హుస్సేన్‌గా గుర్తించారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న ఆయన భార్యను, ఇద్దరు కుమారులను అరెస్టు చేశారు.
- Advertisement -