Wednesday, January 22, 2025

తొమ్మిదేళ్లకే బాలికకు పెళ్లి

- Advertisement -
- Advertisement -

తొమ్మిదేళ్లకే బాలికకు పెళ్లి ..బాదరబందీ. ఇరాక్‌లో ఈ మేరకు నూతన చట్టం తీసుకురానున్నారు. బాలికలు తొమ్మిదేళ్ల ప్రాయానికి వస్తే పెళ్లి చేయడాన్ని చట్టబద్ధం చేసే దిశలో అక్కడ కసరత్తు మొదలైంది.దీనితో నిండా బాల్యం దశలో ఉండే ఈ వయస్సు పసివారికి ఇది జీవితక్రమాన్ని మార్చనుంది. దేశంలోని వ్యక్తిగత చట్టాన్ని సవరించి ఇప్పటివరకూ బాలికలకు ఉన్న వివాహ అర్హత వయోపరిమితి 18ని సగానికి సగం అంటే 9 ఏండ్ల స్థాయికి కుదించేందుకు ఈ చట్టం తీసుకురానున్నారు. పార్లమెంట్‌లో దీనికి సంబంధించిన బిల్లును ప్రతిపాదించారు. దీనిపై దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. బిల్లును న్యాయమంత్రిత్వశాఖ సభలో ప్రవేశపెట్టింది. తొమ్మిదేళ్లకే ఆడపిల్ల పెళ్లికి అనుమతించడం, చట్టబద్ధత కల్పించడం వల్ల పెద్ద ఎత్తున బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు అవుతుంది. అంతేకాకుండా ఓ తరాన్ని మరింతగా వెనకకు నెట్టినట్లు అవుతుందని విమర్శలు మిన్నంటుతున్నాయి. చిన్ననాటనే గర్భవతులు కావడం, గృహహింస వంటి పలు జీవన్మరణ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం అయింది.

ఇరాన్‌లో ఇప్పుడు తలపెట్టిన బిల్లు చట్టరూపం దాలిస్తే బాలికలు తొమ్మిదేళ్లకు , బాలలు 15 ఏండ్ల వయస్సు వచ్చేసరికి వివాహ అర్హత పొందుతారు. ఈ పరిణామం రేపటి తరానికి చీకట్లే మిగులుస్తుందని ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దేశంలో వయోపరిమితి 18 కన్నా తక్కువ లోపే 29 శాతం మంది బాలికలకు ఇరాక్‌లో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు అయిపోతున్నాయి. వారు జీవనక్రమంలో ఇంట బందీలుగా బయట బురఖా బతుకులుగా గడపాల్సి వస్తోంది. పుట్టిన బాలిక జ్ఞానం సంతరించుకునే నాటికే బయటి ప్రపంచంతో ఎటువంటి పరిచయం లేకుండా , వారిని జీవచ్ఛవాలుగా చేసేందుకు ఈ విధమైన చట్టాన్ని తీసుకువస్తున్నారని హక్కుల సంఘాలు , పౌర సమాజం నిరసన వ్యక్తం చేస్తోంది. బాలికలకు వివాహ వయస్సు తగ్గింపు బిల్లును ఇరాక్‌లో ముందుగా జులైలోనే తీసుకురావడానికి యత్నించారు. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనకకు తీసుకుని ఇప్పుడు ఆగస్టులో దీనిలో కొన్ని కొత్త విషయాలు జోప్పించి బిల్లు పెట్టారు.

దేశ పౌరులు తమ కుటుంబ వ్యవహారాల సంబంధిత విషయాలలో మతపరమైన అధీకృత వ్యవస్థ పరిధిలోకి వస్తారా? లేక న్యాయ వ్యవస్థ పరిధిలో విషయాలను పరిష్కరించుకుంటారా? అనేది సొంతంగా ఎంచుకోవచ్చుననే నిబంధనను కూడా ఇందులో చేర్చారు. ఇదో కంటితుడుపుగా పెట్టి బాలికల వయస్సు వారి ఆశలను దెబ్బతీసేదిగా చట్టం ఉందని విమర్శలు వస్తున్నాయి. తొమ్మిదేళ్లకే బాలికకు పెళ్లి అంటే వారిని బందీఖానాలో పెట్టడమే లేదా పుట్టిన తరువాత బతుకనిచ్చి ఈ వయస్సుకు వచ్చేసరికి బలిపశువును చేయడమే అవుతుందని ఓ సామాజికవేత్త నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News