- Advertisement -
బాగ్దాద్ : ఇరాక్‌లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. వైద్య చరిత్రలో తొలిసారిగా మూడు జననాంగాల ఉన్న మగబిడ్డ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. బిడ్డ పుట్టిన మూడు నెలల అనంతరం. తల్లిదండ్రులు చిన్నారి జననాంగాల వద్ద వాపు ఉన్నట్టు గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ప్రధాన అంగానికి సమీపంలో మరో రెండు అంగాలు బయటకువస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలతో రిసేర్చ్ పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ట్రైఫాలియా అంటారని రీసెర్చ్ పేపర్‌ను ప్రచురించిన వైద్యులు షకీర్ సలీమ్ జబాలీ, అయ్యద్ అహ్మద్ మొహ్మద్ తెలిపారు. ప్రతి 50 లక్షల ప్రసవాల్లో ఒకసారి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
- Advertisement -