Monday, December 23, 2024

మణిపూర్‌లో ఉగ్రవాదులకు ఐఆర్‌బి జవాన్, డ్రైవర్ హతం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో కంగ్‌పోక్పీ జిల్లాలో సోమవారం ఉగ్రవాద గ్రూపుల కాల్పులకు గిరిజన తెగలకు చెందిన ఐఆర్‌బి జవాన్, అతని డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరూ వాహనంలో వెళ్తుండగా హరోధల్, కొబ్సా గ్రామాల మధ్య పొంచి ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు ఇండియన్ రిజర్వు బెటాలియన్ (ఐఆర్‌బి) జవానుగా పనిచేస్తున్నారు. గిరిజనులను లక్షంగా చేసుకుని తిరుగుబాటు చేసే ఉగ్రవాదుల స్థావరమైన సింగ్‌డామ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. కుకీజో వర్గం వారే ఈ హత్యలకు పాల్పడ్డారని గిరిజన సమాజం ఆరోపిస్తోంది. దీనిపై కంగ్‌పోక్సీ జిల్లాలో బంద్‌కు పిలుపు నిచ్చారు. మెయితీ, కుకీ వర్గాల మధ్య గత మే నుంచి అనేక ఘర్షణలు జరుగుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News