- Advertisement -
హైదరాబాద్ : ఓఆర్‌ఆర్ టోల్ టెండర్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓఆర్‌ఆర్ టోల్ కాంట్రాక్ట్ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను తక్కువ ధరకే తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ సంస్ధకు అప్పగించిందని విపక్ష కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపణలు చేశారు. ఇందు లో భాగంగా బిజెపి నేత దుబ్బాక
ఎమ్మెల్యే రఘనందన్ రావు కూడా ఓఆర్‌ఆర్ కాంట్రాక్ట్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కాగా రఘనందన్ రా వు ఆరోపణలపై ఐఆర్‌బీ సంస్ధ స్పందించింది. ఓఆర్‌ఆర్ కాంట్రాక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందన్న రఘనందన్‌రావుకు ఐఆర్‌బీ లీగల్ నోటీసులు పంపింది. రఘనందన్‌రావుపై రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.
- Advertisement -