Monday, January 20, 2025

మంగళూరు పేలుళ్లకు మేమే బాధ్యులం: ఐఆర్‌సి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అంతగా ఎవరికి తెలియని ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్(ఐఆర్‌సి) నవంబర్ 19న మంగళూరులో జరిగిన పేలుళ్లకు తమదే బాధ్యత అని పేర్కొంది. తమ ముజాహిద్ సోదరుడు ముహమ్మద్ షరీఖ్ కద్రీ(దక్షిణ కన్నడ జిల్లా)లోని హిందూ మందిరంపై దాడి చేయాలనుకున్నాడని కూడా తెలిపింది. ఆ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలావుండగా ఆ సంస్థ అసలు సంగతేమిటో వెరిఫై చేస్తున్నట్లు ఏడిజిపి(లా అండ్ ఆర్డర్) అలోక్ కుమార్ తెలిపారు.
ప్రీ మేచ్యుర్ పేలుడు కారణంగా షరీఖ్ పోలీసుల చేతికి చిక్కాడు. అంతేకాక ఆ సంస్థ (ఐఆర్‌సి) ఏడిజిపి అలోక్ కుమార్‌ను కూడా హెచ్చరించింది. “షరీఖ్‌ను పట్టుకున్న మీరు ఆనందంతో ఉండవచ్చు. కానీ అది ఎంతో కాలం ఉండదు. మా దృష్టిలో మీరున్నారు. మీ అణచివేతలకు ఫలితం అనుభవిస్తారు. కొంత కాలం వేచి చూడండి. మేము మీ వద్దకు వస్తాం” అని వారు అలోక్ కుమార్‌కు హెచ్చరిక కూడా చేశారు. ‘రాజ్య ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే తాము ఈ పోరాటం చేస్తున్నాం’ అని కూడా ఆ సంస్థ తెలిపింది. తాము కేవలం తమ మీద జరుపుతున్న దాడులను, తమ మత వ్యవహారాలలో కలుగజేసుకోడాన్ని తిప్పికొడుతున్నట్లు వివరణ ఇచ్చింది. ఈ వైరల్ పోస్ట్‌పై అలోక్ కుమార్ “మేము ఆ సందేశంలో అసలెంత అన్నది కనిపెట్టే యత్నం చేస్తున్నాం” అని తెలిపారు.
ముహమ్మద్ షరీఖ్ నవంబర్ 19న ఆటోలో వెళుతుండగా, అతడితో ఉన్న కుక్కర్ పేలింది. దాంతో అతడు, ఆ ఆటో డ్రైవర్ ఇద్దరూ గాయపడ్డారు. కాగా పోలీసులు ఆ పేలుడు ఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News