Saturday, November 23, 2024

ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి శుభవార్త

- Advertisement -
- Advertisement -

IRCTC good news for train passengers

టికెట్లు రద్దు చేస్తే రీఫండ్ తక్షణమే ఖాతాల్లో జమ

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి శుభవార్త అందించింది. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్, యాప్‌లో టికెట్లు బుక్‌చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణికులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. ఐఆర్‌సిటిసి చెల్లింపు గేట్‌వే ఐఆర్‌సిటిసిఐపే ద్వారా టికెట్లు బుక్ చేసే ప్రయాణికులు రద్దు చేసిన తర్వాత వెంటనే రీఫండ్ పొందనున్నారు. కేంద్రప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్‌సిటిసిఐపేను 2019లో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఐఆర్‌సిటిసి తన వెబ్‌సైట్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఐఆర్‌సిటిసి అధికార ప్రతినిధి మాట్లాడుతూ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఐఆర్‌సిటిసి తన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అప్‌డేట్ చేసిందని, దీనివల్ల టికెట్లు బుక్ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. ఈ కొత్త ఏర్పాటు వల్ల ప్రయాణికులు తత్కాల్, సాధారణ టికెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేట్లు వెబ్‌సైట్, పోర్టల్ ఆధునీకరణ చేసినట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News