- Advertisement -
న్యూఢిల్లీ : రైల్వే టికెట్ల బుకింగ్, విమాన, ఈ కేటరింగ్ సర్వీసులకు పరిమితమైన ఐఆర్‌సిటిసి సంస్థ తాజాగా మరో వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించింది. 22 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ ఆన్‌లైన్ బుకింగ్ బస్సు సేవలను ప్రారంభించింది. ఈ సేవలను జనవరి 29న దేశ వ్యాప్తంగా ప్రారంభినట్లు ఐఆర్‌సిటిసి వెల్లడించింది. ఆన్‌లైన్ బస్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్‌సిటిసి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ రూపొందించింది. https://bus.co.in పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా బస్ బుక్ చేసుకోవచ్చు. దేశంలోని 22 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 50, 000 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
- Advertisement -