Thursday, January 23, 2025

పర్యాటకుల కోసం ఐఆర్‌సిటిసి సరికొత్త ప్యాకేజీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధ్యాత్మిక పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ వెళ్లే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తుండగా విమాన మార్గంలో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.
ఈ టూర్ ప్యాకేజీలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్ లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుండగా ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.

‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ ప్రయాణం ఇలా..
మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు లో విమానం ఎక్కితే ఉదయం 7.45 గంటలకు ఇండోర్ చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం ఉజ్జయిని బయలుదేరాలి. అక్కడ స్థానిక ఆలయాలైన హరసిద్ధి మాత ఆలయం, సాందీపని ఆశ్రమం, కాల భైరవ ఆలయం, మంగళనాథ్ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయాల సందర్శనం ఉంటుంది. సాయంత్రం మహాకాళేశ్వర్ ఆలయ దర్శనాన్ని చేసుకోవచ్చు. అనంతరం రాత్రికి ఉజ్జయినిలో బస ఉంటుంది.

రెండో రోజు ఉదయం..
రెండో రోజూ ఉదయం అల్పాహారం చేసి మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం ఉంటుంది. అనంతరం ఓంకారేశ్వర్‌కు బయలుదేరుతారు. సాయంత్రం ఓంకారేశ్వర్ చేరుకున్న తర్వాత ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస ఉంటుంది. అక్కడి నుంచి మూడోరోజూ మహేశ్వర్ బయలుదేరుతారు. మహేశ్వర్ చేరుకున్న అనంతరం అహల్యదేవి ఫోర్ట్, నర్మదా ఘాట్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇండోర్ బయలుదేరాలి. రాత్రికి ఇండోర్‌లో బస ఉంటుంది.

నాలుగోరోజు రిటర్న్
నాలుగో రోజు ఇండోర్‌లో అన్నపూర్ణ మందిర్, లాల్ భాగ్ ప్యాలెస్ సందర్శన ఉంటుంది.. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 7.20 గంటలకు ఇండోర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

హైదరాబాద్ టు ‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ ప్యాకేజీ ధర ఇలా…
హైదరాబాద్ టు మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధరలో భాగంగా సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,000లు, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,200లు, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,300, చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, 4 బ్రేక్‌ఫాస్ట్, 3 డిన్నర్, ఎసి వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News