Tuesday, November 5, 2024

భారీ ఒడుదుడుకులకు లోనైన ఐఆర్‌సిటిసి షేర్!

- Advertisement -
- Advertisement -

IRCTC
ముంబయి: రైల్వేలో కాటరింగ్, టికెట్ బుకింగ్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి సేవలను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్ప్ లిమిటెడ్(ఐఆర్‌సిటిసి) నిర్వహిస్తోంది. అయితే ఐఆర్‌సిటిసిలో వాటాలున్న ప్రభుత్వం టికెట్ బుకింగ్ ద్వారా వస్తోన్న కన్వీనియన్స్ రుసుము ఆదాయంలో 50:50 నిష్పత్తిలో తమకు ఇవ్వాలంటూ గురువారం రైల్వే శాఖకు లేఖ రాసింది. గురువారం దాదాపు 10.59 శాతం మేరకు పెరిగిన ఐఆర్‌సిటిసి షేరు ధర శుక్రవారం సెషన్ తొలి భాగంలోనే దాదాపు 25 శాతంకు పైగానే పడిపోయింది. ఓ దశలో 29 శాతం కుంగి రూ. 650 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. దాంతో వ్యాపార వర్గాలు, మార్కెట్ నిపుణులు సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మదుపర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతున్న కంపెనీలో ప్రభుత్వ జోక్యం ఏ మాత్రం సరికాదని గగ్గోలు పెట్టారు. వేరే దారిలేక ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన కాంత పాండే ట్విటర్ ద్వారా తెలిపారు. దాంతో షేరు ధర మళ్లీ పుంజుకున్నప్పటికీ మార్కెట్ ముగిసే సమయానికి దాని ధర 7.42 నష్టంతో రూ. 845.70 వద్ద ముగిసింది. ఐఆర్‌సిటిసి స్టాక్ ఈక్విటీ శుక్రవారం భారీ ఒడుదుడుకులకు లోనైందనే చెప్పాలి. కొందరు రిటైల్ మదుపరులైతే ప్రీ మానిపులేషన్‌కు చక్కని ఉదాహరణ అని మెసేజ్‌లు పెట్టారు కూడా. 2019-20లో ఐఆర్ సిటిసి ఆదాయం రూ. 349.64 కోట్లు. కాగా 2020-21లో కన్వీనియన్స్ ఫీజు ద్వారా ఐఆర్ సిటిసి రూ. 299.13 కోట్లు పుట్టించింది అన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News