- Advertisement -
లక్నో : పశ్చిమ యూపిలో దట్టంగా పొగమంచు కారణంగా తేజస్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. ఈ ఆలస్యం వల్ల ఐఆర్‌సీటీసి ప్రయాణికులకు పరిహారం చెల్లించింది. శుక్రవారం తేజస్ ఎక్స్‌ప్రెస్ అలీగడ్,గజియాబాద్ మధ్య పొగమంచు దట్టంగా కమ్ముకు పోవడంతో ఎక్స్‌ప్రెస్ కదలలేక పోయింది. దీంతో 12.25 గంటలకు ఢిల్లీకి చేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.19 గంటలకు చేరుకుంది. ఇక ఢిల్లీ నుంచి 4. 59 గంటలకు బయలుదేరాల్సింది కాస్తా ఓ గంట ఆలస్యంగా బయల్దేరింది. ఇతర స్టేషన్లకూ ఆలస్యం గానే చేరుకుంది. మరో వైపు ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణిస్తున్న ఈ ట్రైన్‌లో 544 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐఆర్‌సీటిసీ నిబంధనల ప్రకారం రైల్వే శాఖ వీరందరికీ 250 రూపాయల వంతున మొత్తం 1.36 లక్షల రూపాయలు పరిహారం కింద చెల్లించింది.
- Advertisement -