Wednesday, January 22, 2025

వైష్ణోదేవి దర్శనానికి ఐ.ఆర్.సి.టి.సి ప్రత్యేక ప్యాకేజ్

- Advertisement -
- Advertisement -


మనల తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుండి మాతా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి కాట్రా వెళ్ళాలనుకునే భక్తులకు, పర్యాటకులకు ఐ.ఆర్.సి.టి.సి ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల ట్రిప్‌ను అందిస్తోంది. రైలు మార్గం ద్వారా భక్తులను ఈ యాత్రకు తీస్కెళ్ళనుంది. ఈ టూరిస్ట్ రైలు తిరుపతి నుండి మొదలయ్యి విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుంచి వైష్ణోదేవి కాట్రా యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో హోటల్ వసతి, టీ, కాఫీ, భోజనం, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తదితర సౌకర్యాలు కవర్ అవుతాయి. ఇప్పటికే ఐ.ఆర్.సి.టి.సి విశాఖపట్నం నుంచి మాతావైష్ణోదేవి దర్శనానికి కాట్రా టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

ఇప్పుడు స్వదేశ్ దర్శన్ నార్త్ ఇండియా టూర్ పేరుతో తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి ఈ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. రానున్న మే 27వ తేదీ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. మాతా వైష్ణోదేవి ఆలయంతో పాటు ఆగ్రా, మథుర, అమృత్‌సర్ లాంటి ప్రాంతాలు ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. స్వదేశ్ దర్శన్ నార్త్ ఇండియా యాత్ర ప్రారంభమైన రెండోరోజు రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రోజంతా ప్రయాణం చేశాకా, మర్నాడు ఉదయం రైలు ఆగ్రాకు చేరుకుంటుంది. ఆగ్రాలో తాజ్‌మహల్, ఆగ్రా కోట సందర్శించిన తర్వాత పర్యాటకులు మథురకు బయల్దేరతారు. అక్కడ కృష్ణ జన్మభూమిని దర్శనమయ్యాకా, నాలుగో రోజు శ్రీ మాతా వైష్ణోదేవి దర్శనార్థం కాట్రాకు చేరుకుంటారు.

కాట్రాకు రాగానే నియమ నిభందనలలో భాగంగా పర్యాటకులు అమ్మవారి దర్శనం ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. రాత్రికి కాట్రాలో బస ఏర్పాట్లుంటాయి. మర్నాడు ఉదయమే వైష్ణో దేవి దర్శనం ఉంటుంది. భక్తులు తమతమ ఓపికను, వయసును, అభీష్టాన్ని బట్టి కాలినడక, పోనీ, డోలీ, హెలికాప్టర్ల ద్వారా మాతా వైష్ణోదేవి దర్శనానికి వెళ్లొచ్చు. హెలికాప్టర్ సర్వీస్ కోసం ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. మరుసటి రోజు అమృత్‌సర్ చేరుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ సందర్శన ఉంటుంది. అక్కడినుంచి జలంధర్ బయల్దేరాలి. తదనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఏడో రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది. ఎనిమిదో రోజు పర్యాటకులు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతికి చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఐఆర్‌సీటీసీ స్వదేశ్ దర్శన్ నార్త్ ఇండియా టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.18,120/- కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.22,165/-. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News