Friday, November 22, 2024

తిరుపతి వెళ్లే భక్తుల కోసం నాలుగు రోజుల టూర్ ఫ్యాకేజీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుపతి వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సిటిసి నాలుగు రోజుల టూర్ ఫ్యాకేజీని ప్రకటించింది అందులో భాగంగా ‘పూర్వ సంధ్య’ పేరుతో 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూర్ ఆలయాలను సందర్శించవచ్చు.

ఈ టూర్‌ను బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లిలో, సాయంత్రం 6.10 గంటలకు సికింద్రాబాద్‌లో, రాత్రి 7.38 గంటలకు నల్గొండలో పర్యాటకులు రైలు ఎక్కేలా ఈ టూర్‌ను ఐఆర్‌సిటిసి రూపొందించింది. రెండో రోజూ తెల్లవారుజామున 5:55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్లో ప్రెష్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలు సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాల్సి ఉంటుంది.

నాలుగో రోజు తెల్లవారుజామున
మూడో రోజూ ఉదయం 8.30 గంటలకు తిరుమలకు బయల్దేరాలి. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6.25 గంటలకు తిరుపతిలో రైలు ఎక్కాలి. నాలుగో రోజు తెల్లవారుజామున 03:04 గంటలకు నల్గొండ, 5:35 గంటలకు సికింద్రాబాద్, 6:55 గంటలకు లింగంపల్లి చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సిటిసి ప్యాకేజీ ధరలు ఇలా….
ఐఆర్‌సిటిసి పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ ధరలు మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సిటిసి అధికారులు పేర్కొన్నారు. అందులో భాగంగా స్టాండర్డ్ ట్రిపుల్ షేరింగ్ ధర రూ.5,660లు, డబుల్ షేరింగ్ ధర రూ.5860లు, సింగిల్ షేరింగ్ ధర రూ.7720లు చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీలో ట్రిపుల్ షేరింగ్ ధర రూ.7510లు, డబుల్ షేరింగ్ ధర రూ.7720లు, సింగిల్ షేరింగ్ ధర రూ.9570 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సిటిసి పేర్కొది. ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, సైట్ సీయింగ్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌లు కవర్ అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News