Monday, December 23, 2024

కాశీ యాత్రకు వెళ్లే పర్యాటకుల కోసం ఐఆర్‌సిటిసి ఫ్యాకేజీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాశీ యాత్రకు వెళ్లే పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ‘గంగా రామాయణ్ యాత్ర’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. రైల్‌తో పాటు విమాన మార్గంలో ఈ ప్యాకేజీని అందిస్తున్నట్టు ఐఆర్‌సిటిసి ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా అయోధ్య, ప్రయాగ్ రాజ్, సార్నాథ్, వారణాసితో పాటు పలు ప్రాంతాలను పర్యాటకులకు చూపిస్తామని ఐఆర్‌సిటిసి తెలిపింది.

కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 36,850లు, ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.29,900లు, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.28,200లను ఈ ఫ్యాకేజీ కింద చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలను నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఎసి బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌లు కవర్ అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News