Sunday, January 19, 2025

నేడు ఐర్లాండ్‌తో తొలి పోరు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా బుధవారం తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. గ్రూప్‌ఎలో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో టీమిండియా కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కూడా భారత్‌తో పాటు ఇదే గ్రూపులో ఉంది. ఆదివారం దాయాదితో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరుగుతున్న పోరును భారత్‌కు కీలకంగా తీసుకుంది. ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించి రానున్న పోరుకు సమరోత్సాహంతో సిద్ధం కావాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి, యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శివమ్ దూబె, ఆల్‌రౌండర్లు జడేజా, హార్దిక్‌లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో అలరించారు. వరల్డ్‌కప్‌లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు చాలా కీలకంగా మారాడు. బ్యాట్‌తోనే కాకుండా కెప్టెన్సీలోనూ సత్తా చాటాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది.

విరాట్ కోహ్లి కూడా జట్టుకు కీలకమే. వీరిద్దరూ ఈ వరల్డ్‌కప్‌లో ఎలా ఆడతారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై అందరి దృష్టి నెలకొంది. ఐపిఎల్‌లో అతను పెద్దగా రాణించలేక పోయాడు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతను రాణించడం జట్టుకు శుభసూచకంగా చెప్పాలి. బౌలింగ్‌లోనూ భారత్ బలంగా కనిపిస్తోంది. బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్, జడేజా, కుల్దీప్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న భారత్ ఈ మ్యాచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సవాల్ వంటిదే..

ఇక టీమిండియా వంటి బలమైన జట్టుతో పోరు ఐర్లాండ్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే అసాధారణ ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించక తప్పదు. మరోవైపు ఐర్లాండ్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, లొర్కాన్ టక్కర్, హారి టెక్టర్, ఆండ్రూ బల్‌బిర్నీ, రాస్ అడైర్, డాక్‌రెల్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో భారత్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News