హరారే: జింబాబ్వేతో సోమవారం జరిగిన నాలుగో, చివరి వన్డేలో ఐర్లాండ్ మహిళా జట్టు 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఐర్లాండ్ విమెన్స్ టీమ్ 31తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. యువ సంచలనం అమీ హంటర్ రికార్డు శతకంతో ఐర్లాండ్‌ను ఆదుకుంది.
ఈ క్రమంలో మహిళల వన్డేల్లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతకుముందు భారత స్టార్ మిథాలీ రాజ్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఓపెనర్ గాబి లూయిస్ పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78 పరుగులు చేసింది. కెప్టెన్ డెలాని 53 బంతుల్లోనే 8 ఫోర్లతో 68 పరుగులు సాధించింది. ఇక కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన హంటర్127 బంతుల్లో ఏడు బౌండరీలతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో ఐర్లాండ్ భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. జోసెఫైన్ నొకొమో (66) ఒంటరి పోరాటం చేసింది. ఆష్లే (38), కెప్టెన్ ముసొండా (36), గ్వజురా (25) తప్ప మిగతావారు రాణించలేక పోయారు. ఐర్లాండ్ బౌలర్లు సమష్టిగా రాణించి జట్టు వరుసగా మూడో విజయాన్ని అందించారు. తొలి వన్డేలో జింబాబ్వే గెలువగా ఆ తర్వాత ఐర్లాండ్ వరుసగా మూడు మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది.
Ire Women beat Zim Women with 85 runs in 4th ODI