Tuesday, November 5, 2024

రెండో వారాల్లో మూడు రెట్లు పెరిగిన ఐఆర్‌ఇడిఎ షేర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేవలం 15 రోజుల్లోనే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఇడిఎ) షేర్లు మూడు రెట్లు పెరిగాయి. మంగళవారం ఈ కంపెనీ షేరు 20 శాతం పెరిగి రూ.102 వద్ద ముగిసింది. అంటే ఎవరైనా అందులో ఈ ఐపిఒలో రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.3 లక్షలు అయ్యేది. షేర్ల పెరుగుదల కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.27,000 కోట్లు దాటింది.

ఐఆర్‌ఇడిఎ ఇష్యూ ధర రూ. 32గా ఉంది. అయితే ఈ షేర్లు నవంబర్ 29న ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇ స్టాక్ ఎక్స్ఛేంజీలలో 56.25 శాతం పెరిగి రూ.50 వద్ద లిస్ట్ అయ్యాయి. దీని తర్వాత ఈ షేరులో మరింత పెరుగుదల వచ్చింది, రూ. 28 (87.50 శాతం) పెరిగి రూ.60 వద్ద ముగిసింది. ఇప్పుడు రూ.102కు పెరిగింది. ఐఆర్‌ఇడిఎ ఐపిఒ 40 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News