నేడు ఇంగ్లండ్‌తో పోరు
మెల్‌బోర్న్ : ప్రపంచకప్ సూపర్12లో భాగ ంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఐర్లాండ్ తలపడనుంది. ఇంగ్లండ్ ఇప్పటికే తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. అయితే శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు ఓటమి ఎదురైంది. ఇలాంటి స్థితిలో బలమైన ఇంగ్లండ్‌తో జరిగే పోరు ఐర్లాండ్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలిం గ్ విభాగాల్లో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, బ్రూక్, సామ్ కరన్, వోక్స్ వంటి మ్యాచ్ విన్నర్లు ఇంగ్లండ్‌కు అందుబాటులో ఉన్నారు.
కిందటి మ్యాచ్‌లో కరన్ బంతితో అద్భుతంగా రాణించాడు. 10 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఆఫ్గాన్ ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశాడు. ఈసారి కూడా అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. మార్క్‌వుడ్, వోక్స్, స్టోక్స్, రషీద్‌లతో కూడిన బలమైన బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని పరుగులు సాధించడం ఐర్లాండ్ బ్యాటర్లకు అంత తేలిక కాదనే చెప్పాలి. ఇక బట్లర్, స్టోక్స్, హేల్స్, అలీ తదితరులు బ్యాట్‌తో చెలరేగితే బౌలర్లకు కూడా కష్టాలు ఖాయం. కానీ విండీస్ వంటి బలమైన జట్టును చిత్తుగా ఓడించిన ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం.
స్టిర్లింగ్, బల్బీర్ని, టక్కర్, టెక్టర్, కాంఫెర్, డాక్‌రెల్ వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. డెలాని, అడైర్, లిటిల్, కాంఫెర్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఐర్లాండ్ కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. మరో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన కివీస్ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇక ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన అఫ్గాన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అసాధారణంగా రాణిస్తేనే అఫ్గాన్‌ను గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.