Monday, December 23, 2024

ఐర్లాండ్‌దే వన్డే సిరీస్..

- Advertisement -
- Advertisement -

Ireland historic ODI Series Win over West Indies

జమైకా: వెస్టిండీస్‌తో జరిగిన మూడో చివరి వన్డేలో ఐర్లాండ్ రెండు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఐర్లాండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షాయ్ హోప్ (53) ధాటిగా ఆడాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన హోప్ 9 ఫోర్లు, సిక్స్‌తో వేగంగా 53 పరుగులు చేశాడు. మిగతా వారిలో హోల్డర్ (44), అకిల్ హుస్సేన్ (23), స్మిత్ (20) మాత్రమే రాణించారు. ప్రత్యర్థి జట్టులో ఆండీ మైక్‌బ్రయిన్ నాలుగు, యంగ్ మూడు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 44.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మైక్‌బ్రయిన్ ఆల్‌రౌండ్‌షోతో ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రయిన్ ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 59 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (44), హారి టెక్టర్ (52) జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

Ireland historic ODI Series Win over West Indies

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News