Thursday, November 14, 2024

ఆఫ్‌సైడ్ కింగ్ అతడిలో కనిపిస్తున్నాడు: పఠాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమి ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాజీ కెప్టెన్ గంగూలీని తలపిస్తున్నాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కొనియాడారు. ఈ సందర్భంగా పఠాన్ మీడియాతో మాట్లాడారు. ఆఫ్‌సైడ్ షాట్ల విషయంలో జైస్వాల్, గంగూలీ మధ్య చాలా పోలికలు ఉన్నాయని, టీమిండియాలో అతడు సుదీర్ఘకాలం ఆడుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. జైస్వాల్ ఆటను అస్వాదించడానికి ఇష్ట పడుతానని, ఐపిఎల్‌లో ఎలా ఆడుతాడో వేచి చూస్తున్నానని, ఆఫ్‌సైడ్ కింగ్ గంగూలీకి ఉండేదని, ఇప్పుడు జైస్వాల్ కూడా అలానే ఆడుతున్నాడని పఠాన్ ప్రశంసించారు. ఈ యువ సంచలనం పదేళ్లు జట్టులో ఉంటే సౌరవ్ గంగూలీ గురించి ఎలా చెప్పుకుంటున్నామో, జైస్వాల్ గురించి అలా చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ఆ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లో డబుల్ సెంచరీతో ఫామ్‌లో ఉన్నాడని, దీని వెనుక స్ఫూర్తిదాయక నేపథ్యం ఉంటుందని మెచ్చుకున్నారు. జైస్వాల్ ఓపెనర్‌గా రావడంతో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ దొరికిందన్నాడు. రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌కు కోహ్లీ, రాహుల్, అయ్యర్ లేకపోవడంతో టాప్ అర్డర్‌లో పరుగులు చేయాల్సిన బాధ్యత ఈ యువ సంచలనం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ విజయంలో కీలక పాత్ర పోషించాడని, హైదరాబాద్ టెస్టులో గౌరవ ప్రదమైన స్కోర్ చేసి ఔరా అనిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News