Sunday, March 23, 2025

ఇర్ఫాన్ పఠాన్‌కు షాక్.. ఆ పదవి నుంచి ఔట్!

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 18వ సీజన్ శనివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందుకు టీం ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌కు ఐపిఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఐపిఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి అతన్ని బిసిసిఐ పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. కామెంట్రీ సమయంలో కొంతమంది ఆటగాళ్లపై కావాలనే వ్యాఖ్యలు చేసినట్లు ఇర్ఫాన్‌పై ఫిర్యాదులు వచ్చాయట. ఐపిఎల్ 18వ సీజన్‌కు సంబంధించిన కామెంట్రీ ప్యానల్ వివరాలను శుక్రవారం విడుదల చేయగా.. అందులో ఇర్ఫాన్ పేరు లేదు. అతనిపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే అతని పేరును తొలగించినట్లు టాక్. అయితే కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగించిన వెంటనే పఠాన్ యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించాడు. ఈ విషయాన్ని ‘మైక్ ఆన్, ఫిల్టర్ ఆఫ్’ అనే క్యాప్షన్‌తో ఎక్స్‌ ద్వారా అభిమానులతో అతను పంచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News