- Advertisement -
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి మరికొంత కాలం పాటు టి20 కెప్టెన్‌గా కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. జట్టును విజయపథంలో నడిపించే సత్తా అతనికి ఉందన్నాడు. వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్‌కప్ వరకు కోహ్లి కెప్టెన్‌గా కొనసాగి ఉంటే టీమిండియాకు ప్రయోజనంగా ఉండేదన్నాడు. కాగా, ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని.. వన్డే, టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా కొనసాగుతానని ఇటీవల విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Irfan Pathan responds on Kohli quit from T20 Captaincy
- Advertisement -