Sunday, December 22, 2024

సౌతాఫ్రికా పర్యటన: ముగ్గురు కెప్టెన్ల ఎంపికపై ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయడంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బిసిసిఐ ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందో తనకు అర్థం కాలేదన్నాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ స్థానంలో రాహుల్‌ను ఒక్కడినే కెప్టెన్‌గా నియమిస్తే సరిపోయేదన్నాడు.

టి20లకు సూర్యకుమార్‌ను, వన్డేలకు రాహుల్ సారథిగా బిసిసిఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే టి20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న సమయంలో కెప్టెన్ల విషయంలో ఇలాంటి ప్రయోగాలు సరికావని అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News