Friday, November 22, 2024

నాగాలాండ్ ఘటన కనువిప్పు కావాలి: ఇరోమ్ షర్మిల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని(ఎఎఫ్‌ఎస్‌పిఎ) ఈశాన్య రాష్ట్రాలలో రద్దు చేయడానికి ఇటీవల నాగాలాండ్‌లో పౌరులపై భద్రతా దళాలు జరిపిన కాల్పులతో కనువిప్పు కలగాలని హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల అన్నారు. ఎఎఫ్‌ఎస్‌పిఎ కేవలం అణచివేత కోసం తీసుకొచ్చిన చట్టం మాత్రమే కాదని, మౌలిక మానవ హక్కుల ఉల్లంఘనకు కూడా ఇది పాల్పడుతోందని షర్మిల అన్నారు. ఈ చట్టానికి ఎక్కడైనా సోదాలు నిర్వహించి ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఉంది. అస్సాం, నాగాలాండ్, మణిపూర్(ఇంఫాల్ మునిసిపల్ కౌన్సిల్ ప్రాంతం మినహాయించి), అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో ఈ చట్టం అమలులో ఉంది.

నాగాలాండ్ సంఘటనతో ఈ రాక్షస చట్టం రద్దు ఆవశ్యకత మరోసారి బయటపడిందని, ఇదో కనువిప్పు కావాలని, మనుషుల ప్రాణాలకు విలువలేకుండా పోయిందని ఇరోమ్ షర్మిల ఒక వార్తాసంస్థకు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వూలో వ్యాఖ్యానించారు. ఈ చట్టం కారణంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇంకెంత కాలం బలికావాలని, తిరుగుబాటు అణచివేత పేరుతో ప్రజల ప్రాథమిక హక్కులను ఎలా హరిస్తారని ఆమె ప్రశ్నించారు. తిరుగుబాటును ఎదుర్కోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయని భద్రతా దళాల చట్టంపై 16 సంవత్సరాలు సుదీర్ఘ నిరాహార దీక్ష సాగించిన షర్మిల సూచించారు.

Irom Sharmila demands to AFSPA Act Cancelled

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News