Thursday, January 23, 2025

రేషన్ బియ్యం రీసైక్లింగ్ పై ఉక్కు పాదం: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినా, సీఎంఆర్ లో రేషన్ బియ్యం కలిపినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల సంస్ధ ఛైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లా అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లా అధికారులు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలలో పీడీఎస్ రైస్ అక్రమ దందా ను అరికట్టాలని, సీఎంఆర్ డెలివరీలో రీసైక్లింగ్ చేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల సంస్థ కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నా, ఎవరైనా కొనుగోలు చేసినా నేరమేనని అమ్మిన, కొనుగోలు చేసినా ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

రైస్ మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణలో, రీసైక్లింగ్ పాల్పడిన మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని, నాణ్యత విషయంలో మిక్స్ ఇండికేటర్ టెస్ట్ తప్పనిసరి చేయాలని, ప్రతి కన్‌సైన్మెంట్‌లో 580 బ్యాగులు శాంపిల్ డ్రా చేసి నాణ్యత పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదే స్థాయిలో మంచి నాణ్యమైన బియ్యం పంపిణీలో కూడా అంతే ప్రాధాన్యతను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జీఎం మార్కెటింగ్, హెడ్ ఆఫీస్ టెక్నికల్ మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News