Friday, January 24, 2025

రైల్వే ట్రాక్ దొంగలపై ఉక్కు పాదం మోపాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : రైల్వే ట్రాక్ దొంగలపై ఉక్కు పాదం మోపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి చేరికల సంఘం చైర్మన్, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం రైలు ప్రమాదంలో మృతి చెందిన హుజరాబాద్ నియోజకవర్గంకు చెందిన ముప్పు శ్రీకాంత్ మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి సందర్శించి మార్చురీలో పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రైలు ప్రయాణంలో రైల్వే ట్రాక్ పై కొందరు దుండగులు రైల్లో ప్రయాణిస్తున్న శ్రీకాంత్ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు లాక్కోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. కమలాపూర్ మండలం నే రెళ్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్ తల్లిదండ్రులు కష్టపడి చదివించాగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని అండగా ఉంటూ పోషించేవాడని సెలవు దినం కావడంతో గ్రామానికి వచ్చే క్రమంలో ఈ దుర్ఘటన చోటు చే సుకుందని అన్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైల్వే ట్రాక్‌లపై ఇలాంటి దొంగలపై ఉక్కు పా దం మోపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకోవెళ్తానని తెలిపారు. శ్రీకాంత్ కుటుంబం చాలా పేదరిక కుటుంబమని, ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వి ధాలుగా ఆ దుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఆలేరు నియోజకవర్గ నాయకులు పడాల శ్రీనివాస్, భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ, కౌన్సిలర్ బలరాం, నాయకులు రాస వెంకట్, జనగాం నరసింహచారి, శ్రీనివాస్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News