Monday, December 23, 2024

బిర్యానిలో ఇనుప ముక్కలు వచ్చాయని అడిగినందుకు చావబాదారు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: బిర్యాని తింటుండగా ఇనుప పీచు ముక్కలు రావడంతో హోటల్ నిర్వహకులను కస్టమర్ల అడిగారు. దీంతో కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చేవెళ్ల మండలం రేగడి ఘన్‌పూర్ గ్రామానికి చెందిన నాగరాజు, సురేశ్, బేగరి శంకర్, మహేంద్ర కలిసి అంగడిచిట్టంపల్లిలో ఓ హోటల్‌కు బిర్యాని తినడానికి వెళ్లారు.

వారు బిర్యాని తింటుండగా ఇనుప పీచు ముక్కలు కనిపించడంతో హోటల్ నిర్వహకులను ప్రశ్నించారు. దీనికి బదులు వేరే ప్లేటులో భోజనం పెడుతామని దురుసుగా చెప్పడంతో ఇరువురు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకొవడంతో కస్టమర్లను హోటల్ నిర్వహకులు చావబాదారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News