Wednesday, January 22, 2025

ఫ్యాషన్ షోలో ప్రమాదం: 24 ఏళ్ల మోడల్ మృతి

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలోగల ఫిల్మ్ సిటీలో ఆదివారం మధ్యాహ్నం ఒక ఫ్యాషన్ షో జరుగుతుండగా ఇనుప లైటింగ్ స్టాండ్ కూలిపోయి క 24 ఏళ్ల మహిళా మోడల్ మరనించింది. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫిల్మ్ సిటీలోని లక్ష్మీ స్టూడియోలో ఈ దుర్ఘటన జరిగింది. భారీ ఇనుప లైటింగ్ స్టాండ్ కూలిపోవడంతో దాని కింద నలిగి 24 ఏళ్ల మోడల్ వంశికా చోప్రా మరణించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.ఈ సంఘటనలో బాబీ రాజ్ అనే యూనిట్ సభ్యుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. లైటింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేసిన సిబ్బందిని, ఫ్యాషన్ షోనిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News