- Advertisement -
ఆదిలాబాద్: ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇనుప చువ్వల మీదపడడంతో అతడి భుజంలోకి ఇనుప చువ్వ దిగిన సంఘటన ఆదిలాబాద్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. సందేశ్ అనే (11) బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఇందిరానగర్‌లో నివసిస్తున్నాడు. ఆడుకోవడానికి తన అమ్మమ్మ ఉంటున్న గాంధీనగర్ కు సందేశ్ వెళ్లాడు. భవన నిర్మాణం జరుగుతున్న దగ్గర పిల్లలతో ఆడుకుంటుండగా కిందజారి పడ్డాడు. అక్కడ ఇనుప చువ్వ ఉండడంతో అతడి కుడి చేతిలోకి గుచ్చుకుంది. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆర్థోపిడిక్ వైద్యుడు శ్యామ్ ప్రసాద్ సర్జరీ చేసి ఇనుప చువ్వను బయటకు తీశారు. తల్లిదండ్రులు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -