Wednesday, January 22, 2025

100 రోజుల్లో నిగ్గు తేలుస్తాం

- Advertisement -
- Advertisement -

థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాల
ఆరోపణలపై విచారణ ప్రారంభం..
అవసరమైతే కీలక వ్యక్తులకు నోటీసులు
దర్యాప్తు కమిషన్ చైర్మన్ జస్టిస్
నరసింహారెడ్డి వెల్లడి
కీలక భేటీకి హాజరైన ట్రాన్స్‌కో,
జెన్‌కో సిఎండిలు, విద్యుత్
కొనుగోలు ఒప్పందాలపైనా నజర్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలు అవకతవకలపై న్యాయవిచారణ ప్రారంభమైంది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒ ప్పందం విషయంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధింని అంశాల్లో నిజాలు నిగ్గు తేల్చేందు కు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు న్యాయవిచారణ శ్రీకారం చుట్టారు.కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ గా నియమితులైన జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నే తృత్వంలో ఆదివారం బూర్గులరామకృష్ణారావు భవన్‌లో విద్యుత్ రంగానికి చెందిన ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. సు మా రు మూడు గంటల పాటు జరిగిన ఈ సమవేశం లో పలు అంశాలపైన కమీషన్ విచారణ జరిపింది. ఈ సందర్బంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ రం గానికి చెందిన అక్రమాల్లో బాధ్యులైన వ్యక్తులందరినీ గుర్తించి త్వరలో వారికి నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు.

కమిషన్ ముందు హాజ రై తమ అభిప్రాయాలు, వాదనలు తెలియజేయడానికి వారికి అవకాశమిస్తామన్నారు. ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లో కీలక పాత్రపోషించిన మాజీ సిఎం (కేసీఆర్), మాజీ మంత్రులను సైతం విచారణకు పిలుస్తారా అని పాత్రికేయులు ప్రశ్నించగా, అవసరమైతే వారికీ లేఖలు రాస్తామని తెలిపారు. తొలుత రిక్వెస్ట్ లెటర్స్ రాస్తామని, అవసరమైతే సమన్లు జారీ చేసే అధికారం కూడా తమకు ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా విచారణ నిర్వహిస్తామని, నిర్ణయాల్లో చట్టబద్ధత, సమంజసంగా మాత్రమే సమీక్షిస్తామని తెలిపారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంలో కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఛత్తీస్‌గఢ్ డిస్కంల నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చు కోవడంపై న్యాయ విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించమన్నారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ ఎస్‌ఏఎం రిజ్వీ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. గడువు మేరకు 100 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తామన్నారు. నాటి నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులే ఇంకా విద్యుత్ సంస్థల డైరెక్టర్లుగా కొనసాగుతూ న్యాయ విచారణలో కమిషన్‌కు సహకరిస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఫైళ్లను తారుమారు చేసినట్టు ఆరోపణలూ వచ్చాయని విలేకరులు జస్టిస్ నరసింహా రెడ్డి దృష్టికి తీసుళ్లగా, మూడు ఒప్పందాలకు సంబంధించిన అన్ని ఫైళ్లను తమ కార్యాలయానికి చేరాయని జస్టిస్ నరసింహారెడ్డి బదులిచ్చారు. వాటి ప్రాథమిక పరిశీలన కూడా పూర్తయిందని తెలిపారు. అవసరమైతే ఇంకా ఫైళ్లను అడుగుతామన్నారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి బదులుగా నామినేషన్లు, లిమిటెడ్ టెండర్ల పేరుతో వందల కోట్ల రూపాయలు విలువ చేసే సివిల్ పనులను సైతం కాంట్రాక్టర్లకు అప్పగించిన అంశంతో పాటు యాదాద్రి విద్యుత్ కేంద్రం భూసేకరణలో అవకతవకతలపై సైతం విచారణ నిర్వహిస్తారా అని విలేకరులు ప్రస్తావించగా సమాధానాన్ని దాటవేశారు.

త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలు, ఛత్తీస్‌గఢ్ పీపీఏపై అన్ని వర్గాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. ఇందుకోసం త్వరలో బహిరంగ ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. ఎవరైనా సరే ఈ-మెయిల్ ద్వారా లేదా లేఖ ద్వారా తమ వద్ద ఉన్న సమాచారాన్ని తమ కార్యాలయానికి చేరవేయవచ్చని తెలిపారు. సాంకేతిక పరిజ్ణానం కలిగిన కొద్ది మంది వ్యక్తుల నుంచి సమాచార సేకరణ కోసం పరిమిత రీతిలో బహిరంగ విచారణ సైతం నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు సైతం బహిరంగ విచారణలో పాల్గొని తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేయవచ్చని తెలిపారు . విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీ బహిరంగ విచారణలకు హాజరు కావద్దని గతంలో ఆంక్షలు విధించారని, ఈ పరిస్థితిలో కమిషన్ ముందు హాజరయ్యే సాక్ష్యం చెప్పే ఉద్యోగులకు రక్షణ కల్పిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, అది విద్యుత్ సంస్థల అంతర్గత విషయమన్నారు. దూషణలకు, రాజకీయ విమర్శలకు తావులేకుండా విచారణ నిర్వహించేందుకు సహకరించాలని జస్టిస్ నరసింహారెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News