Sunday, September 8, 2024

సాగునీటి రంగానికి రూ. 22,301కోట్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర బడ్జెట్‌లోకాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంలో తుదిదశలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయకట్టు పెంచే 18 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ఏకంగా రూ.22,301 కోట్లను కేటాయించింది.రాష్ట్రప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయిలో బడ్జెట్‌లో సాగునీటి రంగంలో నూతన ప్రాజెక్టుల నిర్మాణం కంటే, తుది దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి మొగ్గుచూపింది. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టిందని, ఎన్డీఎస్‌ఏ సూచనల ఆధారంగా ప్రాజెక్టును కాపాడుకుంటామని ప్రకటించింది. నీటి పారుదల శాఖకు ఈ బడ్జెట్‌లో 22వేల 301 కోట్ల రూపాయలను కేటాయించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 34భారీ ప్రాజెక్టులు , మరో 39 మధ్యతరహా ప్రాజెక్టులతో కలిపి మొత్తం 73 ప్రాజెక్టులు చేపడితే అందులో 42 ప్రాజెక్టులు(10 భారీ ప్రాజెక్టులు , 32మధ్యతరహా ప్రాజెక్టులు) పూర్తి ఆయ్యాయి.

మరో 31 ప్రాజెక్టులు (24భారీ ప్రాజెక్టులు, 7 మధ్యతరహా ప్రాజెక్టులు)నిర్మాణదశలో ఉన్నట్టు ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రాజెక్టులను ఈ ఏడాది, 12 ప్రాజెక్టులను వచ్చే ఏడాది పూర్తి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతోపాటు ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తొదరపాటు నిర్ణయాలు, డిజైన్లలో లోపాలు, నాణ్యతారహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేశాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై చేసిన ఆర్భాటపు ప్రచారాలతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలిపారు. కాని కొద్దికాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురయిందన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవక తవకలను గుర్తించి తగిన చర్యలను సూచించేందుకు విచారణ కమిటిని నియమించినట్టు వెల్లడించారు.

ఈ న్యాయ విచారణ కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోటం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన వేల కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి నిపుణుల సూచనలకు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుపై విచారణ కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టు విస్తీర్ణం పెంచాలని సంకల్పించింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో సాగునీటి పారుదల రంగానికి రూ. 22,301 కోట్లు కేటాయించామని ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News