Wednesday, January 22, 2025

అద్భుతమైన డెస్టినేషన్ సెంటర్ గా రంగనాయక సాగర్: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జిల్లాలోని రంగనాయక సాగర్ వద్ద సాగునీటి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సాగునీటి దినోత్సవంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చాయని, కరెంటు సమస్యలు తీరినాయన్నారు. మరో రెండు నెలల్లో సిద్దిపేటకు రైలు కూడా వస్తోందని.. ఇక నుంచి సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు ఉంటాయని తెలిపారు. కోమటి చెరువు కంటే పదింతల అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా రంగనాయక సాగర్ కాబోతోందన్నారు.

హైదరాబాద్, బెంగళూరు వాళ్లు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ఇక్కడికి వచ్చి జరుపుకునేలా, అద్భుతమైన డెస్టినేషన్ సెంటర్ గా ఈ రంగనాయక సాగర్ ను తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. సెలవులు వస్తే మనవాళ్లు గోవా, ఊటి వెళ్దామా అంటున్నారని.. గోవాలోని బీచ్ కు వెళ్లేందుకు అందరు ఇష్టపడుతున్నారని అన్నారు. మనకు సముద్రం, బీచ్ లేవని అనుకుంటున్నారని.. అయితే, ఆ బీచ్ ఫీల్ ను కూడా రంగనాయక సాగర్ వద్ద తీసుకువస్తామని పేర్కొన్నారు. రంగనాయక సాగర్ వద్ద అద్భుతమైన ఆర్టిఫిషల్ బీచ్ ను ఏర్పాటు చేస్తున్నామని.. అంతేకాకుండా బీచ్ గేమ్స్ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News