- Advertisement -
సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం,గుమ్మడిదల మండలంలో నీటి పారుదల శాఖలో ఎఈ రవికిశోర్ ఎసిబి వలకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే…గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ఇరిగేషన్ పనుల ఎన్‌ఒసి కోసం సంతోష్ అనే వ్యక్తి ఎఈని కలిశారు. అందుకుగాకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్‌పి శ్రీధర్ నేతృత్వంలో పటాన్‌చెరులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకున్న డబ్బును ఎఈ కారులో స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎసిబి అధికారులు ఇరిగేషన్ కార్యాలయంలోకి వచ్చిన విషయాన్ని గమనించిన ముఖ్య అధికారి తన కార్యాలయం నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన ఎసిబి అధికారులు అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
- Advertisement -